Jailer 2 Collections: వన్ అండ్ ఓన్లీ ఇండియన్ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ 2 ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌ను కుదిపేస్తోంది. రిలీజ్‌కు ముందు వరకు పెద్దగా హైప్ లేకపోయినప్పటికీ, సినిమా విడుదలైన మొదటి రోజు ఫస్ట్ షో నుంచే అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తోంది. వీకెండ్, వర్కింగ్ డేస్ అనే తేడా లేకుండా ఊచ కోత కోస్తోందనే చెప్పాలి.
ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, బాక్సాఫీస్ వద్ద ఈ తొమ్మిది రోజుల్లో జైలర్ 2 మూవీ సాధించిన కలెక్షన్లను ఒకసారి గమనిస్తే..
మొదటి రోజు రూ.130 కోట్ల గ్రాస్.. ఆల్‌టైమ్ రికార్డ్!(Jailer 2 Collections)
రిలీజ్‌కు ముందు వరకు పెద్దగా హైప్ లేకపోయినా, వరల్డ్‌వైడ్‌గా జరిగిన ప్రీమియర్లతో జైలర్ 2 అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. రిలీజ్ అయిన తొలిరోజు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ దక్కడంతో, ప్రపంచవ్యాప్తంగా ఫైనల్ ఆఫ్‌లైన్, ఆన్లైన్ లెక్కలన్నీ కలుపుకొని దాదాపు రూ.130 కోట్ల రేంజ్లో గ్రాస్, రూ.60 కోట్లకు పైగా షేర్ మార్క్ ఓపెనింగ్ కలెక్షన్లను దక్కించుకుంది. దీంతో ఇండియన్ సినిమా చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డును సృష్టించిందనే చెప్పాలి.
రెండో రోజు తగ్గిన కలెక్షన్లు.. మూడో రోజు మళ్లీ ఊపు!
ఇక రెండో రోజు శుక్రవారం కలెక్షన్లు కాస్త (Jailer 2 Collections)మందగించాయి. అయితే మూడో రోజు శనివారం వీకెండ్ కావడంతో పాటు దసరా హాలిడేస్ కూడా కలిసి వచ్చాయి. ఇటు తెలుగులో స్ట్రెయిట్ ఫిల్మ్ అయిన రణబాలి భారీ ఎత్తున రిలీజ్ అయినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద జైలర్ 2 ప్రభంజనానికి ఏ మాత్రం బ్రేకులు వేయలేకపోయింది.

దీంతో రెండో రోజు శుక్రవారం రూ.75 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ కలెక్షన్లతో సరిపెట్టుకున్నప్పటికీ, మూడో రోజు శనివారం మాత్రం ఏకంగా 80% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరో రూ.100 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ కలెక్షన్లను రాబట్టింది. మొత్తంగా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి ఏకంగా రూ.310 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ కలెక్షన్లతో సరికొత్త రికార్డును సృష్టించిందనే చెప్పాలి.
నాలుగో రోజు కూడా రూ.100 కోట్ల గ్రాస్!
ఇక నాలుగో రోజు ఆదివారం కావడంతో మార్నింగ్ షో నుంచే అద్భుతమైన బుకింగ్స్ నమోదయ్యాయి. దాదాపుగా 80% థియేట్రికల్ ఆక్యుపెన్సీతో ప్రపంచవ్యాప్తంగా మరో రూ.100 కోట్ల రేంజ్లో భారీ గ్రాస్ మార్క్ కలెక్షన్లను రాబట్టడం విశేషం.
ఐదో రోజు కూడా తగ్గని జోరు.. రూ.75 కోట్ల గ్రాస్!
ఇలా ఆకాశమే హద్దుగా దూసుకుపోతూ ఐదో రోజులోకి ఎంటర్ అయ్యేసరికి, వీకెండ్లో వసూళ్లు రావడం ఓకే కానీ, వర్కింగ్ డేస్‌లో కూడా ఈ రేంజ్ మాస్ బ్యాటింగ్ ఉంటుందని అస్సలు ఊహించలేదు. పోటీలో ఎన్ని సినిమాలు ఉన్నప్పటికీ, జైలర్ 2కి మాత్రమే ఆడియన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్ కనిపిస్తోంది.
అందుకే వీకెండ్, వర్కింగ్ డేస్ అనే తేడా లేకుండా జైలర్ 2 కోసం ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో ఐదో రోజు ఎక్కడా పెద్దగా డ్రాప్స్ లేకుండా, మంచి ఫుట్‌ఫాల్స్‌తో దాదాపు 56% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైంది. ఐదో రోజు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.75 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ కలెక్షన్లను రాబట్టడం విశేషం.
ఆరో రోజు రూ.70 కోట్ల గ్రాస్‌తో దుమ్ము లేపిన జైలర్ 2!
ఇక ఆరో రోజు మంగళవారం కూడా అదే జోరు కొనసాగించింది. (Jailer 2 Collections)అత్యధికంగా తమిళనాడులో 1,500 స్క్రీన్లలో 5,000 షోలకు గాను 70% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైంది. దీంతో అక్కడ దాదాపు రూ.28 కోట్ల రేంజ్ భారీ గ్రాస్ మార్క్ కలెక్షన్లతో అదరగొట్టింది.
తెలుగులో 650కి పైగా స్క్రీన్లలో 1,500కు పైగా షోలకు గాను 50% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.10 కోట్ల మేర గ్రాస్ మార్క్ కలెక్షన్లను రాబట్టింది. ఇటు హిందీలో రూ.5 కోట్లు, కేరళలో రూ.6 కోట్లు, కర్ణాటకలో రూ.8 కోట్ల మేర వసూళ్లు సాధించింది.
మొత్తంగా ఇండియా వైడ్‌గా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్ట్ చేయగా, ఓవర్సీస్లో మరో రూ.20 కోట్ల రేంజ్లో వసూళ్లను రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ కలెక్షన్లతో దుమ్ము లేపేసిందనే చెప్పాలి.
ఏడో, ఎనిమిదో రోజుల్లోనూ మాస్ రచ్చ!
ఇలా ఏడో, ఎనిమిదో రోజుల్లో కూడా జైలర్ 2 తన జోరును కొనసాగించింది. (Jailer 2 Collections)ప్రపంచవ్యాప్తంగా 50% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైంది. ఇండియా వైడ్‌గా దాదాపు రూ.60 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ కలెక్షన్లను దక్కించుకోగా, ఓవర్సీస్లో మరో రూ.25 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ కలెక్షన్లను రాబట్టింది.
మొత్తంగా ఏడో, ఎనిమిదో రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.85 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ కలెక్షన్లతో ఓ రేంజ్లో పర్వాలేదనిపించింది.
తొమ్మిదో రోజు రూ.40 కోట్ల గ్రాస్!
ఇక తొమ్మిదో రోజు విషయానికి వస్తే, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా(Jailer 2 Collections) దాదాపు రూ.8 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ కలెక్ట్ చేసింది. మార్నింగ్ షో నుంచే దాదాపు 45% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైంది.
దీంతో ఇండియా వైడ్‌గా రూ.30 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ కలెక్ట్ చేయగా, ఓవర్సీస్లో మరో రూ.10 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ కలెక్షన్లను రాబట్టింది. మొత్తంగా తొమ్మిదో రోజు రూ.40 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ కలెక్షన్లతో పర్వాలేదనిపించింది.
9 రోజుల్లో రూ.650 కోట్ల గ్రాస్.. రూ.360 కోట్ల షేర్!
ఇలా మొత్తంగా ఇప్పటివరకు వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద జైలర్ 2 దాదాపు రూ.650 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్, రూ.360 కోట్ల రేంజ్ షేర్ మార్క్ కలెక్షన్లతో మాస్ రచ్చ చేస్తోందనే చెప్పాలి.

