Gajab Raat Movie Review: బాలీవుడ్ నుంచి నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సినిమా గజబ్ రాత్ . దాదాపు రెండు గంటల రన్టైమ్తో వచ్చిన ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. అయితే, కథలో కొత్తదనం, స్క్రీన్‌ప్లేలో ఆసక్తికరమైన సన్నివేశాలు లేకపోవడంతో సినిమా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
బాలీవుడ్ నుంచి నేరుగా ఓటీటీలో విడుదలవుతున్న కొన్ని సినిమాలను చూస్తుంటే, ఒక చిన్న పాయింట్ తీసుకుని దాని చుట్టూ కథ అల్లేసి సినిమా పూర్తి చేసినట్టుగా అనిపిస్తోంది. గతంలో వచ్చిన కొన్ని సినిమాల్లోనూ ఇదే సమస్య కనిపించింది. అయితే, *రిపోర్టింగ్ లైవ్* మాత్రం ఇందుకు మినహాయింపుగా నిలిచింది. ఇప్పుడు గజబ్రత్ కూడా అదే కోవలోకి వస్తుంది.
గజబ్ రాత్ కథేంటి?
ఒక పోలీస్ రైడ్ జరుగుతున్న సమయంలో, రాత్రికి రాత్రే ఓ కారులో తీసుకెళ్తున్న గాయాలతో ఉన్న అమ్మాయి అకస్మాత్తుగా రోడ్డుపైకి దూకేస్తుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆమెను కారులో తీసుకెళ్తున్న వ్యక్తులు ఎవరు? ఆమెకు తెలిసిన రహస్యం ఏంటి? ఆ కేసులో మనోజ్ బాజ్‌పేయి పాత్ర ఏమిటి? ఆ అమ్మాయిని కాపాడే క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? అనేదే ఈ సినిమా కథ.
ఒక రహస్యాన్ని బయటపెట్టే ప్రయత్నం, ఆ విషయం తెలిసిన వ్యక్తిని చంపాలని ప్రయత్నించడం, ఆ వ్యక్తిని హీరో కాపాడటం.. ఇలాంటి కథలను మనం ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాలోనూ ఇలాంటి పాయింట్ కనిపిస్తుంది. ఇంకా చాలా సినిమాల్లో ఇదే తరహా కథాంశాలు వచ్చాయి.
ఈ సినిమాలో కూడా అదే పాయింట్‌ను కాస్త భిన్నంగా చూపించడానికి ప్రయత్నించారు. కానీ కథనంలో ఆసక్తి లేకపోవడంతో సినిమా చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే సన్నివేశాలు తక్కువగా ఉండటంతో నిరాశ కలుగుతుంది.

ప్లస్ పాయింట్స్(Gajab Raat Movie Review)
మనోజ్ బాజ్‌పేయి నటన
ఈ సినిమాకు ప్రధాన బలం మనోజ్ బాజ్‌పేయి నటన. తన పాత్రకు తగ్గట్టుగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమా ఎక్కడైనా చూడగలిగేలా ఉందంటే అందుకు ప్రధాన కారణం ఆయన నటనే. తన పెర్ఫార్మెన్స్తో సినిమాను నిలబెట్టడానికి గట్టిగానే ప్రయత్నించారు.
పోలీస్ వ్యవస్థ, రాజకీయ అవినీతి
పోలీస్ వ్యవస్థలోని లోపాలు, రాజకీయ నాయకుల అవినీతి, మనీ డీల్స్, రహస్యాలను రికార్డు చేసి బయటపెట్టే విధానం వంటి అంశాలను చూపించిన తీరు బాగుంది. ఈ విషయాలపై మేకర్స్ కొంత రీసెర్చ్ చేసినట్టు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి.
మ్యూజిక్, సినిమాటోగ్రఫీ
సినిమాలో మ్యూజిక్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా ఓకే. కథలోని సీరియస్‌నెస్‌కు తగ్గట్టుగా సాంకేతిక విభాగాలు తమ పని చేశాయి. అయితే, ఇవి సినిమా మొత్తాన్ని ఆసక్తికరంగా మార్చలేకపోయాయి.
మైనస్ పాయింట్స్(Gajab Raat Movie Review))
రొటీన్ కథ.. స్లో నరేషన్
ఈ సినిమాకు ప్రధాన మైనస్ రొటీన్ కథ, స్లో నరేషన్. కథలో కొత్తదనం చాలా తక్కువగా ఉంటుంది. సన్నివేశాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి కానీ, ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా ఉండవు. థ్రిల్లర్‌కు తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉన్నప్పటికీ బోర్ తగ్గదు.
ఎమోషనల్ కనెక్షన్ మిస్
సినిమాలోని పాత్రలతో ప్రేక్షకులకు ఎలాంటి కనెక్షన్ ఏర్పడదు. చాలా సన్నివేశాలు చూస్తుంటే సినిమా కంటే డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మనోజ్ బాజ్‌పేయిని మినహాయిస్తే మిగతా పాత్రలు పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి.
ప్రకాష్ రాజ్ పాత్రకు కూడా పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఇతర పాత్రలు, కామియోలు సైతం చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపించలేకపోయాయి. హీరో పాజిటివ్‌గా మారే క్రమంలో వచ్చే కొన్ని అంశాలు కూడా కన్విన్సింగ్‌గా అనిపించవు.
క్లైమాక్స్‌లోనూ నిరాశే
సినిమా క్లైమాక్స్ కూడా హడావుడిగా ముగిసినట్టు అనిపిస్తుంది. కథకు సరైన ముగింపు దొరికిన ఫీలింగ్ కలగదు. ప్రేక్షకులను సంతృప్తిపరిచే స్థాయిలో ఎండింగ్ లేకపోవడం మరో మైనస్.
ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా?
ఈ సినిమాను పూర్తిగా ఫ్యామిలీతో కలిసి చూడగలిగే సినిమా అని చెప్పలేం. కొన్ని హిందీ వల్గర్ పదాలు, ఎక్స్పోజింగ్ సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమా ప్రారంభంలోనే పోలీస్ రైడ్, వ్యభిచారానికి సంబంధించిన సన్నివేశాలు కనిపిస్తాయి. కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూసేటప్పుడు కొన్ని చోట్ల ఇబ్బందిగా అనిపించవచ్చు.
గజబ్ రాత్ మూవీ ఫైనల్ వెర్డిక్ట్
ఒక రొటీన్ కథను కొన్ని కొత్త పాత్రలతో భిన్నంగా చూపించడానికి ప్రయత్నించారు(Gajab Raat Movie Review). కానీ స్క్రీన్‌ప్లేలో ఎంగేజింగ్ సన్నివేశాలు లేకపోవడం, ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవడం, స్లో నరేషన్ వల్ల సినిమా బోరింగ్‌గా మారుతుంది.
మనోజ్ బాజ్‌పేయి నటన ఒక్కటే చెప్పుకోదగ్గ అంశం. పోలీస్ వ్యవస్థ, రాజకీయ అవినీతి వంటి విషయాలపై ఆసక్తి ఉన్నవాళ్లకు కొన్ని సన్నివేశాలు నచ్చొచ్చు. న్యూస్ ఛానల్స్ ఎక్కువగా చూసేవాళ్లకు కూడా ఈ అంశాలు కొంత ఆసక్తిని కలిగించవచ్చు. కానీ మిగతా ప్రేక్షకులకు సినిమా అంతగా కనెక్ట్ కాకపోవచ్చు.
ప్లస్ & మైనస్ పాయింట్స్
ప్లస్ పాయింట్స్
- మనోజ్ బాజ్‌పేయి నటన
- పోలీస్ వ్యవస్థ, రాజకీయ అవినీతిపై చూపించిన అంశాలు
- మ్యూజిక్, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
- రొటీన్ కథ
- స్లో నరేషన్
- ఆసక్తికరమైన సన్నివేశాలు లేకపోవడం
- ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవడం
- ఇతర పాత్రలకు ప్రాధాన్యత లేకపోవడం
- కన్విన్సింగ్‌గా లేని కొన్ని సన్నివేశాలు
- నిరాశపరిచే క్లైమాక్స్
ఫైనల్ వర్డిక్ట్
ఫైనల్‌గా: మనోజ్ బాజ్‌పేయి నటన బాగున్నా, రొటీన్ కథ, స్లో నరేషన్తో గజబ్ రాత్ బోరింగ్ థ్రిల్లర్‌గా మిగిలింది. పోలీస్ వ్యవస్థ, రాజకీయ అవినీతి అంశాలపై ఆసక్తి ఉన్నవాళ్లకు కొన్ని సన్నివేశాలు నచ్చొచ్చు. మిగతా ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. నా వరకు ఈ సినిమాను రికమెండ్ చేయను.

