ఆదర్శ కుటుంబం డే 1 కలెక్షన్: బజ్ లేకపోయినా ₹16.65 కోట్ల ఓపెనింగ్.. బ్రేక్ ఈవెన్ దూరమెంత?
Aadarsha Kutumbam Box Office Collection Day 1: విడుదలకు ముందు ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ చుట్టూ పెద్దగా హడావుడి లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా సాగాయి, ఓవర్సీస్ ప్రీ సేల్స్ కూడా అంతంతమాత్రమే. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు ఇది తక్కువ ఓపెనింగ్ అవుతుందని చాలామంది అనుకున్నారు. కానీ మొదటి రోజు లెక్కలు చూస్తే సినిమా ఆ అంచనాలను దాటి నిలబడింది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాలో వెంకటేష్‌తో పాటు శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, నివేదా పేతురాజ్, వెన్నెల కిషోర్, సత్య, రావు రమేష్, బ్రహ్మాజీ నటించారు. రన్‌టైమ్ 2 గంటల 30 నిమిషాలు.
మొదటి రోజు ఎంత వచ్చింది?(Aadarsha Kutumbam Box Office Collection Day 1)
బాక్సాఫీస్ ట్రాకర్ Sacnilk లెక్కల ప్రకారం ‘ఆదర్శ కుటుంబం’ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ₹16.65 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
| కలెక్షన్ | |
| ఇండియా నెట్ | ₹9.50 కోట్లు |
| ఇండియా గ్రాస్ | ₹11.15 కోట్లు |
| ఓవర్సీస్ గ్రాస్ | ₹5.50 కోట్లు |
| వరల్డ్‌వైడ్ గ్రాస్ | ₹16.65 కోట్లు |
3,073 షోలలో సగటు ఆక్యుపెన్సీ 44.1 శాతం నమోదైంది.
ఇండియా గ్రాస్‌లో సింహభాగం తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చింది. ఏపీ, తెలంగాణ కలిపి ₹9.25 కోట్ల గ్రాస్ వసూలైంది. కర్ణాటక నుంచి ₹1.40 కోట్లు, తమిళనాడు నుంచి ₹30 లక్షలు, మిగతా రాష్ట్రాల నుంచి ₹20 లక్షల వరకు వచ్చాయి.
ఓవర్సీస్ లెక్క ఆసక్తికరంగా ఉంది. విడుదలకు ముందు నార్త్ అమెరికా ప్రీ సేల్స్ బలహీనంగా ఉన్నా, మొదటి రోజు ఓవర్సీస్ నుంచి ₹5.50 కోట్లు వచ్చాయి. మొత్తం కలెక్షన్‌లో ఇది మూడో వంతు. ఉదయం షోలకు టికెట్లు అంతగా తెగకపోయినా, పాజిటివ్ టాక్ బయటికొచ్చాక సాయంత్రం షోలకు జనం పెరిగారు. వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ అడ్వాన్స్‌గా కాకుండా నేరుగా కౌంటర్ దగ్గరే టికెట్ కొన్నారని ఈ ట్రెండ్ చెప్తోంది.
రెండో రోజు ట్రెండ్
శనివారం అడ్వాన్స్ బుకింగ్స్ శుక్రవారం కంటే కొంచెం మెరుగ్గా ఉన్నాయి. వీకెండ్ కావడంతో కౌంటర్ బుకింగ్స్ కలిస్తే రెండో రోజు మొదటి రోజుకు దగ్గరగా లేదా అంతకంటే ఎక్కువ రావచ్చన్నది అంచనా. అసలు లెక్కలు రేపటికి తేలతాయి.
బ్రేక్ ఈవెన్ టార్గెట్
ప్రచారంలో ఉన్న బిజినెస్ లెక్కల ప్రకారం సినిమా గట్టెక్కాలంటే ఏరియాల వారీగా రావాల్సిన షేర్ ఇది:
| ఏరియా | టార్గెట్ (షేర్) |
| నైజాం | ₹17 కోట్లు |
| సీడెడ్ | ₹7 కోట్లు |
| ఆంధ్ర | ₹20 కోట్లు |
| కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా | ₹6 కోట్లు |
| ఓవర్సీస్ | ₹13 కోట్లు |
| వరల్డ్‌వైడ్ | ₹63 కోట్లు |
తెలుగు రాష్ట్రాల టార్గెట్ ఒక్కటే ₹44 కోట్ల షేర్. మొదటి రోజు ఏపీ, తెలంగాణ (Aadarsha Kutumbam Box Office Collection Day 1)నుంచి వచ్చిన ₹9.25 కోట్ల గ్రాస్ షేర్ రూపంలో సుమారు ₹5 కోట్ల దగ్గర ఉంటుంది. అంటే తెలుగు రాష్ట్రాల టార్గెట్‌లో తొమ్మిదో వంతే మొదటి రోజు వచ్చింది. ఓవర్సీస్‌లో మాత్రం మంచి స్టార్ట్ దొరికింది. వరల్డ్‌వైడ్‌గా చూస్తే ఇంకా చాలా దూరం వెళ్ళాలి.
అసలు పరీక్ష సోమవారం
వీకెండ్ కలెక్షన్లు ఎంత బాగున్నా, ఫ్యామిలీ సినిమాల భవిష్యత్తు సోమవారం తేలుతుంది. వీక్ డేస్‌లో ఆక్యుపెన్సీ ఎంత నిలబడితే లాంగ్ రన్ అంత బలంగా ఉంటుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’తో వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంత బలమైనవాళ్ళో ఇదివరకే రుజువైంది. ఆ ఆడియన్స్ రెండో వారం కూడా థియేటర్లకు వస్తే ₹63 కోట్ల టార్గెట్ అసాధ్యం కాదు. లేకపోతే మొదటి వారంలోనే సినిమా ఊపు తగ్గిపోయే ప్రమాదం ఉంది.
