Cutl Movie Review And Rating : కొంతకాలంగా విశ్వక్ సేన్ కెరీర్‌లో సరైన హిట్ పడట్లేదు. ఎవరి డైరెక్షన్‌లో చేసినా వర్కవుట్ కాకపోవడంతో ఈసారి అన్నీ తానే చూసుకున్నాడు. కథ రాసుకున్నాడు, డైరెక్ట్ చేశాడు, హీరోగానూ నటించాడు. మరి ఈ ప్రయత్నం ఫలించిందా అంటే, సమాధానం “పర్వాలేదు” దగ్గరే ఆగిపోతుంది.

కథేంటి?

కథ చాలా సింపుల్. బాగా డబ్బున్న కొంతమంది ఓ ప్రైవేట్ ఐలాండ్‌లో పార్టీ కోసం కలుస్తారు. ఆ పార్టీ కాసేపటికే ఓ గేమ్‌గా మారిపోతుంది. ఆడితేనే, గెలిస్తేనే బయటికి వెళ్ళగలరు. స్క్విడ్ గేమ్ తరహాలో సినిమా సర్వైవల్ థ్రిల్లర్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. హీరో ఓ డీఎస్పీ. అతని ఆలోచనలు, ఈ పరిస్థితిని అతను ఎలా ఎదుర్కొన్నాడన్నదే సినిమా.

సినిమా చూస్తుంటే నాని ‘హిట్ 3’ సెకండ్ హాఫ్ గుర్తుకొస్తుంది. దాదాపు ఆ ఫార్మాట్‌నే సినిమా మొత్తం సాగదీసినట్టు అనిపిస్తుంది. అక్కడక్కడ విజయ్ ‘బీస్ట్’ ఛాయలు కూడా కనిపిస్తాయి.

బాగున్నవి

ఇటీవల టాలీవుడ్‌లో సర్వైవల్ థ్రిల్లర్లు తక్కువగా వచ్చాయి. ఆ లిస్ట్‌లో ఈ సినిమాను చేర్చొచ్చు. కొన్నిచోట్ల సస్పెన్స్ బాగానే బిల్డ్ అవుతుంది. సెకండ్ హాఫ్‌లో హీరో క్యారెక్టర్‌కి సంబంధించి ఓ సర్‌ప్రైజ్ ఉంటుంది, అది బాగానే వర్కవుట్ అయింది. BGM కొన్ని సీన్లలో ఆకట్టుకుంటుంది. తనపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ని డైలాగులుగా మార్చిన చోట్ల కొంత క్రియేటివిటీ కనిపిస్తుంది.

తేడా కొట్టినవి(Cutl Movie Review And Rating)

అసలు సమస్య సెల్ఫ్ ఎలివేషన్. హీరో, డైరెక్టర్ ఒక్కరే కావడంతో తనను తాను పైకి లేపుకునే సీన్లు మోతాదు మించాయి. ఇదే పాత్ర వేరే హీరో చేసుంటే ప్రేక్షకులు ఇంకాస్త సులువుగా యాక్సెప్ట్ చేసేవారేమో. అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్‌గా విశ్వక్ విగ్గు, మేకప్ ఆర్టిఫిషియల్‌గా కనిపిస్తాయి. ఆ లుక్ పాత్రకు సెట్ అవ్వలేదు.

ఇప్పుడు చాలా సినిమాలు ఒకే ఫార్ములా పట్టుకున్నాయి. (Cutl Movie Review And Rating)వయలెన్స్, బ్లడ్ బాత్, లౌడ్ బీజీఎం, పక్కన క్యారెక్టర్లు షాక్ అయి చూస్తున్న షాట్లు. అందరికీ వర్కవుట్ అవుతోంది కాబట్టి తనకూ అవుతుందని ఈ సినిమా కూడా అదే దారిలో వెళ్ళింది. కాళ్ళు, చేతులు తెగిపోయే గోర్ సీన్లు చాలానే ఉన్నాయి, కానీ వీఎఫ్‌ఎక్స్ బలహీనంగా ఉండటంతో ఆ ఇంపాక్ట్ రాలేదు. చాలాచోట్ల ఇది గ్రాఫిక్స్ అని స్పష్టంగా తెలిసిపోతుంది.

లాజిక్ లేని సీన్లు కూడా ఎక్కువే. ఫిక్షనల్ కథ అయినా ప్రేక్షకులు కొంత లాజిక్ వెతుకుతారు. ఆ లింకులు, కనెక్షన్లు సరిగా ప్లాన్ చేసుంటే బాగుండేది. కొన్ని సీన్లు చూస్తుంటే “(Cutl Movie Review And Rating)ఇలా ఎలా జరుగుతుంది?” అనే ప్రశ్న రాక మానదు.

ఇంకోటి, ట్రోల్స్‌కి సినిమాలోనే సమాధానాలు ఇవ్వడం. కొన్నిచోట్ల అది సరదాగా ఉన్నా, చాలాచోట్ల కథ నుంచి పక్కకు తీసుకెళ్ళింది. సినిమా కథ చెప్పాలి. హీరో వ్యక్తిగత జీవితం, సోషల్ మీడియా గొడవలు అక్కడికి తీసుకురావడం సరైన పద్ధతి కాదు.

ఒకేసారి డైరెక్షన్, యాక్టింగ్ చేయడం తేలికైన పని కాదు. ఆ కష్టాన్ని గౌరవించాల్సిందే. కానీ అంత కష్టపడినప్పుడు ఫలితం ఇంకా బలంగా రావాలి. ఇక్కడ అక్కడక్కడ ఐదారు సెకన్ల హై మూమెంట్లు తప్ప, బయటికి వచ్చాక గుర్తుపెట్టుకునే సీన్ ఒక్కటీ ఉండదు.

ఒక మంచి నిర్ణయం

టికెట్ రేట్లు పెంచకుండా ఒరిజినల్ రేట్లకే సినిమా విడుదల చేశారు. ప్రీమియర్ షోలు కూడా పెట్టలేదు. ఈ నిర్ణయం మాత్రం మెచ్చుకోదగినది.

ప్లస్ & మైనస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్

  • సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌
  • అక్కడక్కడ ఆకట్టుకునే సస్పెన్స్‌ సన్నివేశాలు
  • ద్వితీయార్ధంలోని ట్విస్ట్‌
  • కొన్ని చోట్ల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌
  • టికెట్ ధరలు పెంచకపోవడం

మైనస్ పాయింట్స్

  • కథలో కొత్తదనం లేకపోవడం
  • విశ్వక్ సేన్ పాత్రకు ఎక్కువ ఎలివేషన్‌ ఇవ్వడం
  • కొన్ని సన్నివేశాల్లో లాజిక్‌ మిస్‌ అవడం
  • కృత్రిమంగా అనిపించే మేకప్‌, విగ్‌
  • నాసిరకంగా అనిపించే వీఎఫ్‌ఎక్స్‌
  • అనవసరమైన హింస, రక్తపాత సన్నివేశాలు
  • సోషల్ మీడియా ట్రోల్స్‌పై డైలాగులు కథకు అంతగా ఉపయోగపడకపోవడం

ఫైనల్ వర్డిక్ట్

2.25/5

ఫైనల్‌గా: #కల్ట్ (#cult)ఒక యావరేజ్‌ సర్వైవల్‌ థ్రిల్లర్‌. అక్కడక్కడ ఆసక్తికరమైన సన్నివేశాలు, ఓ ట్విస్ట్‌ ఉన్నప్పటికీ కథలో కొత్తదనం లోపించింది. సాధారణ అంచనాలతో వెళ్తే ఒకసారి చూడొచ్చు.